
తెలంగాణ ప్రజలకు మాత్రమే తాము ఏజెంట్లమన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ లోక్ సభ స్థానం, మెదక్ లోక్ సభ సెగ్మెంట్ లలో ప్రచారం నిర్వహించారు కేసీఆర్. ముందుగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సభలో పాల్గొన్నారు. అనుకున్న స్థాయిలో దేశం ఇంకా అభివృద్ధి చెందలేదన్న గులాబీ బాస్… తమకు లోపాయికారి ఒప్పందాలు అవసరం లేదన్నారు. ఐదేళ్ల పాలనలో మోడీ అట్టర్ ప్లాప్ అయ్యారన్నారు.
తెలంగాణ సమస్యలు పరిష్కరిస్తూనే దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతామన్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలు కోరుకునే కనీస ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేదన్నారు. రైతులు ధనవంతులు కావాలనేదే మా లక్ష్యమన్నారు గులాబీ బాస్ కేసీఆర్. 16 ఎంపీలను టీఆర్ఎస్ కు ఇస్తే.. దేశం గతి మారుస్తా అని కేసీఆర్ చెప్పారు.
ఆ తర్వాత మెదక్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ పథకాలను మోడీ కూడా నకలు కొట్టారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తో మనకు పోటీ లేదన్న కేసీఆర్….తెలంగాణలో టీఆర్ఎస్ తో…టీఆర్ఎస్ కే పోటీ అన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా…రేపు గురువారం మహబూబాబాద్, ఖమ్మం సభల్లో పాల్గొననున్నారు గులాబీ బాస్.