కేసీఆర్​ పాంహౌస్ లో కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నాడు

కేసీఆర్​ పాంహౌస్ లో కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నాడు

అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్​ ఫాంహౌస్​ లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నాడంటూ.... బిచ్చగాళ్లు అవగాహన లేకుండా మాట్లాడుతుంటే సమాధానం చెప్పాల్సిన అవసరంలేదన్నారు. కాంగ్రెస్​ ఎంపీలు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న మంత్రి కోమటిరెడ్డి... తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్​ పాత్ర శూన్యమన్నారు. అప్పట్లో రాజీనామా చేయడం.. బైఎలక్షన్​నిర్వహించడం.. ఆంధ్రనేతల దగ్గర డబ్బులు  తీసుకోవడం కేసీఆర్​కు అలవాటుగా మారిందన్నారు.   ఉమ్మడి నల్గొండ జిల్లా, పాలమూరుకు నీళ్లు అందించే ఎస్ ఎల్ బీ సీ   ప్రాజెక్టు లపై కక్షగట్టి  కేసీఆర్​ పూర్తి చేయలేదన్నారు.   

అందుకే  అసెంబ్లీ, పార్లమెంట్​  ఎన్నికల్లో ప్రజలు  తగిన బుద్ధి చెప్పారంటూ... ఇప్పుడు బయటకు వచ్చిన కేసీఆర్​..  దెబ్బ కొడితే లేవలేరు అంటున్నారు ...  మేము తిరగబడితే  కేసీఆర్, కేసీఆర్ పార్టీ ఉండదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.  కొంతమంది బీఆర్​ఎస్​ నేతలు ఫోన్ టాపింగ్ కేసులో తప్పించుకొని తిరుగుతున్నారు ... అమెరికా నుంచి ఇండియాకు రావాలంటే భయపడుతున్నారని ..  కేసిఆర్ కుటుంబంపై అవినీతి.. అక్రమాలపై అనేక కేసులు ఉన్నాయి . పదేళ్లలో  పేదలకు ఇల్లు ఇవ్వకపోగా.. కనీసం ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయలేదని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి.