ఇంజనీర్ల మాట కేసీఆర్​ వినలే : వివేక్​ వెంకటస్వామి

  •  బ్యారేజ్​ నష్టానికి కారణమైన ఆయనను 
  • అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్ల డిజైన్ల ను పట్టించుకోకుండా కేసీఆర్ అన్ని తానై వ్యవహరించాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఇంజనీర్లు చెప్పినట్లు కేసీఆర్ విని ఉంటే మేడిగడ్డ డ్యామేజ్ జరిగేది కాదన్నారు. మంగళవారం అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు వెళ్లే ముందు వివేక్ మీడియాతో మాట్లాడారు. బ్యారేజ్ డ్యామేజ్ కు కారణమైన కేసీఆర్​ను అరెస్ట్​ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై మొదటి నుంచి పోరాడుతున్నానన్నారు. ప్రాజెక్టు లోపాలపై గత ప్రభుత్వానికి ఎన్ని సార్లు సూచించినా పట్టించుకోలేదని వివేక్ గుర్తు చేశారు. బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని, అందరితో చర్చించి ఆదుకుంటామని సీఎం చెప్పారని ఆయన వెల్లడించారు.