ఎల్లారెడ్డిపేట, వెలుగు: కృష్ణా జలాలను సాధించడంలో గత సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేసిందని ఆరోపించారు.
పదేండ్ల పాలనలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులపై వివక్ష చూపారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే సాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ రెడ్డి, నారాయణరెడ్డి, గోగురు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్ గౌడ్, నారా గౌడ్ పాల్గొన్నారు.