- స్టేషన్ ఘన్పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- కేసీఆర్ కుటుంబ ప్రస్తుత ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
- బీఆర్ఎస్ లో రెండోస్థానం కోసం బావబామ్మర్దులు పోటీ
- బీజేపీలో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నరని ఫైర్
జనగామ, వెలుగు : పదేండ్ల తెలంగాణను కేసీఆర్ఫ్యామిలీ లూటీ చేసిందని స్టేషన్ ఘన్పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్న ఆ కుటుంబానికి నీతి, నిజాయితీ గురించి మాట్లాడే నైతికత లేదని ఫైర్ అయ్యారు. 2014కు ముందు.. ప్రస్తుతం ఉన్న వారి ఆస్తుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జనగామ అగ్రికల్చర్ మార్కెట్‌కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గత ప్రభుత్వ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అప్పట్లో ప్రభుత్వ విధానాలు బాగా లేవని అడిగితే కేసీఆర్తనను పక్కన పెట్టాడని ఆరోపించారు. తీవ్ర ఆర్థిక లోటున్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో చక్కటి పాలన అందిస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. కేసీఆర్ఫాంహౌజ్నుంచి ఎప్పుడు బయటకు వస్తడో తెల్వదని, కానీ.. ఆయన తర్వాత స్థానంపై బావ బామ్మర్దులు పోటీ పడుతున్నారన్నారు. పదేండ్లలో సంపాదించిన అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ లీడర్లు పైసలిచ్చి పెయిడ్ ఆర్టికల్స్ రాయించు కుంటున్నారని విమర్శించారు. ఒకరిని మించి ఒకరు పేపర్లలో ఫొటోల కోసం ప్రెస్మీట్లు పెట్టి రేవంత్సర్కారుపై అక్కసు వెళ్లగక్కు తున్నా రని ఆయన మండిపడ్డారు. బీజేపీ లీడర్లకు అధికార యావ తప్ప మరొకటి లేదని విమర్శించారు. కిషన్‌రెడ్డిది ఒక మాట, ఈటల రాజేందర్‌ది మరో మాట, రఘునందన్‌రావుది ఇంకో మాట అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తున్నారన్నారు. హైడ్రాను రఘునందన్‌రావు సమర్ధిస్తే ఈటల వద్దంటుండని, దమ్ముంటే అందరూ కలిసి ప్రెస్‌మీట్‌పెట్టి బీజేపీ వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్‌చేశారు.