ఫ్యామిలీ కోసమే ఈ పాలిటిక్స్…

తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్‌ చేసి, సెంటిమెంట్ తో అధికారానికి రాగానే తన ప్రయోజనాలనే చూసుకుంటున్నాడు. కేసీఆర్‌. ఆయనను అభద్రత వెన్నాడుతోంది. 18 స్థా నాల్లో ఎలక్షన్‌ అక్రమాలపై హైకోర్టులో పిటీషన్లు ఉన్నవి. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే 18 సీట్లు మరో 6 నెలలలోపు కోల్పోవాల్సి వస్తుంది. అల్లుడు హరీశ్ తో ప్రభుత్వం ప్రమాదంలో పడితే 30 దాక ఎమ్మెల్యేలు జారిపోయినా గానీ, 61 సీట్లతో ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనే కుటిల నీతి ఈ అక్రమ వలసలను ప్రోత్పహిస్తోంది. 16 ఎంపీ సీట్లు ఎలాగైనా గెలవక పోతే రేపు రాబోయే ప్రభుత్వంతో సమస్యలు రావచ్చనే భయం.

తెలంగాణ ఉద్యమ నేపద్యాన్ని రాజకీయాంశంగా మార్చి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సకల జనుల ఉద్యమ విజయాన్ని తన విజయంగా మార్చుకుని ఉద్యమ నాయకుడినని రాజకీయాలు చేస్తున్న రోజులివి.

వర్తమాన చరిత్రలో కె.సి.ఆర్ .ని రాజకీయ నేర్పరిగా చాలామంది అభివర్ణిస్తుంటారు. ఎత్తుగడలు,వ్యుహాల అమలులో ఉద్దండుడు అని కొంత మంది అంటుంటారు. మరి కొంతమంది భజనపరుల మాటలు కోటలు దాటుతుంటాయి. చాల మంది అభిప్రాయం అదే అన్నట్లు గా ప్రచారం చేస్తుంటారు.ఉద్యమ నీతైనా, రాజనీతైనా నాయకుడి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుందనే వాస్తవం గ్రహించాల్సిన అవసరం ఉంది.1996 మలి దశ ఉద్యమం వామపక్ష ఉద్యమ నేపథ్యం నుండి ఉద్భవిస్తే రాజకీయాంశంతో జోడించి వినూత్నరాజకీయ ఉద్యమాన్ని చేసి నిరంతరం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకు న్న స్వార్ధపరుడిగా కెసీఆర్ ను చూశాం. తెలంగాణ అనే పాడి ఆవుతో తన అన్ని అవసరాలు తీర్చుకుని ఇప్పుడు పిప్పిని కూడా అమ్ముకుంటున్నాడు. రాజకీయ హిందుత్వ ఎలాగో.. రాజకీయ తెలంగాణను వాడుకుంటూ తన కుటుంబాన్ని రాజకీయాల్లో రాణించే విధంగా చేస్తూ ఇంకా తెలంగాణతోనే ఈ దేశంలో ప్రముఖమైన ప్రధాని మీద కన్నేశాడు.తెలంగాణ ప్రాంత భావోద్వేగాలను తన రాజకీయప్రయోజనాలకు పునాదిగా చేసుకుని ఫక్తు రాజకీయ పార్టీటీగా మార్చుకున్న తర్వాత కూడా ఉద్యమ పార్టీయేనని అప్పుడప్పుడు ఎన్నికల సమయాల్లో మాత్రమే ఢంకా బజాయిస్తాడు.

తెలంగాణ ఉద్యమం నీతి, నిజాయితీలకు ప్రతీక.కానీ, మాటల గారడితో తిమ్మిని బమ్మి చేసే మాట తప్పే నాయకుడు దానికి నాయకత్వం వహించడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం. నిరంతరం మాటలు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతూ అబద్ధాలతో నెట్టుకొస్తూ కొనసాగడం. ఎవరేమైనా అంటే తెలంగాణను అడ్డు పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది.ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీలను ఒప్పించి ప్రధాని ప్రతిపక్షమైన బీజేపీ సహకారంతో తెలంగాణ బిల్లును పార్లమెం టులో పెట్టి పాస్‌ చేయిం చడమే కాకుండా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌ అధికారాన్ని చేబట్టకుండా రాష్ట్రపతి పాలన విధించి సార్వత్రిక ఎన్నికలకు పోవడం ఒక మహా రాజనీతి. ఆ రోజున తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు 50 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో ఒక వ్యూహం ప్రకారం లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోను బిల్‌ పాస్‌ చేయించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రజెంటేషన్ తో సంతృప్తి చెందిన అధిష్టానం… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం సీడబ్ల్ యూసీ ద్వారా తీసుకున్న విషయం మరువరాదు. సొంత పార్టీ ఎంపీలు, స్పీకర్ పై పెప్పర్‌ స్ప్రేలు చల్లినా , ఎన్నో అడ్డంకులు సృష్టించినా తెలంగాణను సాకారం చేసింది సోనియా గాంధీయే అనే విషయం అందరికీ స్పష్టంగా తెలుసు.ఆనాడు పెద్దపల్లి ఎంపీగా ఉన్న జి.వివేక్‌, నాగర్‌ కర్నూల్ ఎంపీగా ఉన్న మందా జగన్నాథం కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదిరించి ఉద్యమ పార్టీ అని టీఆర్‌ఎస్ లో కొనసాగడం ఎంత సాహసమో ఆలోచించాలి. ఆ పరిణామం మొట్టమొదటిగా కాంగ్రెస్‌ పార్టీని ఆలోచనలో పడేసింది. సొంత పార్టీ నేతలు పార్టీని వీడటాన్నిఅధిష్టానం సీరియస్ గా తీసుకుంది. మిగతా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, పార్టీని వీడిపోతారని భావించిన సోనియా గాంధీ ఆ రోజుల్లో ట్రబుల్ షూటర్ గా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీని రంగంలోకి దింపి సముదాయించడం అందరికీ తెలిసిందే. సోనియా గాంధీ వెరవకుండా తెలంగాణ రాష్ట్ర సాధన చేయడానికి కారణాలు… ఒకటి తెలంగాణ అమర వీరుల త్యాగం, రెండవది నిరంతరంగా కొనసాగిన తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యాచరణ.

అప్పుడూ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్ ను విలీనం చేస్తానని బేరసారాల కోసం నెల రోజులు ఢిల్లీలో మకాం వేశాడు. అక్కడ ప్రధాన పాత్ర ఇస్తేనే విలీనం చేస్తా అని తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టడానికి వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా తెలంగాణ ఇస్తారని పసిగట్టిన కేసీఆర్‌ ముఖ్య పదవులు ఇవ్వాలని అధిష్టానం ముందు మోకరిల్లాడు. ‘ప్రజలు సాధించిన విజయానికి నీకు  ముఖ్య పదవులు ఎందుకివ్వాలి! పార్టీని విలీనం చేశాక మీ గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. కాంగ్రెస్లో చేరితే పరిస్థితి ఎలా ఉంటుం దో అని విలీనం–పొత్తు పేరుతో డ్రామా నడిపించాడు.శల్య సారధ్యం నడిపి కాంగ్రెస్సే తిరస్కరించినట్టుగా ప్రజలను నమ్మించి సెంటిమెంట్ తో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాడు కేసీఆర్‌.

ఇక్కడ ఎక్కడా తెలంగాణ ప్రయోజనాలు కనపడవు, ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి సెంటిమెంట్ ను రెచ్చగొట్టి, ఆత్మహత్యలను తన వాళ్లతోనే ప్రేరేపించి 1200 మందిని పొట్టనబెట్టుకున్నాడు. రక్తపు చుక్క చిందకుండా ఉద్యమం విజయవంతమయ్యిందని నమ్మబలికి తను అధికారంలోకి వచ్చాక… ఉద్యమంలో 400 మందే అమరులైనారని ఆ కుటుంబాలకు కూడా మోసం చేశాడు కేసీఆర్‌.తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జేఏసీని కూడా విచ్ఛిన్నం చేసి తనకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేనినీ బతకనీయకుండా చేసి తానే ఉద్యమ పితనని,తెలంగాణ గాంధీనని పోస్టర్లు వేయించుకు న్నాడు.మరి జయశంకర్‌ సారేమయ్యాడు? జేఏసీ నాయకుడు కోదండరాం శత్రువయ్యాడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ శత్రువయ్యింది. తెలంగాణను వ్యతిరేకించిన మోడీ ప్రియుడయ్యాడు. తెలంగాణ ఇచ్చిందనే నెపంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను పతనం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు కేసీఆర్‌. ఎంత నమ్మక ద్రోహం, ఎంత స్వార్థం తనలో ఉన్నాయో ఇప్పటి దాకా గమనించారు అనుకుంటా. ఇవి మచ్చుకు కొన్ని అంశాలే.

ఉద్యమంతో దళితుల బంధం

తెలంగాణ ఉద్యమానికి దళితులకు విడదీయరాని సంబంధం ఉంది. మొదటగా తెలుగు రాష్ట్రాల్లో దళితుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న  మారోజు  వీరన్న తెలంగాణ ఉద్యమంలోనే అమరుడయ్యాడు. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ ‘జై తెలంగాణ’ అని నినదించాకే కాల్పులు జరిపారు. స్వాతంత్రోద్యమ కాలంలో హైదరాబాద్‌ స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నది. బత్తుల శ్యామ్‌ సుందర్‌. తెలంగాణ కల సాకారం కావాలని టీఆర్‌ఎస్ కి చేయూతనిచ్చిన వారిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ, జి.వెం కటస్వామి (కాకా)ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ పార్టీపై ఒత్తిడి తెచ్చింది జి.వివేక్‌, మందా జగన్నాథం దళితులే.తెలంగాణ జేఏసీని బలోపేతం చేసిన వారిలో మల్లేపల్లి లక్ష్మయ్య, మంద కృష్ణమాదిగ, నాలాం టివారమంతా దళితులమే. పార్లమెంట్ లో హోంమంత్రి హోదాలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సుశీల్‌ కుమార్‌ షిండే దళితుడే. స్పీకర్‌ స్థానంలో ఉండి బిల్లు పాస్ చేసిన మీరా కుమార్‌ సాక్షాత్తూ బాబు జగ్జీవన్‌ రాం వారసురాలే. తెలంగాణ కోసం బలిదానాలు చేసినవారందరిలో బడుగు బలహీన వర్గాలవారే అధికం. ఇంత మంది ముందు వాగ్ధానం చేసి మోసం చేసిన కేసీఆర్‌ వంచనకు మారు రూపం. నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే బూతులు. రాజ్యాం గబద్ద హోదాలో ఉండి తను చేస్తున్న పనికి మాలిన ప్రసంగాలను తెలుగు సమాజం భరించాల్సి వస్తోంది.

ఇక, ఈ లోక్ సభ ఎన్నికల్లో కొత్త డ్రామాకి తెర లేపాడు.16 సీట్లు వస్తే కేసీఆర్‌ ప్రధానమంత్రి అయ్యే అవకాశం అని కొడుకు, ప్రధాని అయ్యే ఉద్దేశం లేదని అయ్యా చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొడుకు కేటీఆర్‌. పార్టీ ముఖ్య స్థానాల్లో ఉంచడానికి ఏ సామాజిక వర్గాలు కనబడవు. ఈయన రేపు భారతదేశంలో గుణాత్మక మార్పు తెస్తాడంటే నమ్మాలా? 88 మంది ఎమ్మెల్యే లు గెలిచినంక కూడా ఇంకా ఇతర పార్టీల నాయకులెందుకు? 15 మంది ఎంపీలు, 100 మంది కార్పొరే టర్లు ఉన్నా ఇంకా వార్డు మెంబర్లను ,కౌన్సిలర్లను , ఎంపీపీలను, జెడ్పీ టీసీలను, సర్పంచ్లను ఎందుకు కొనుక్కో వాల్సి వస్తుంది అంటే అభద్రత వెన్నాడుతోంది.

18 స్థానాల్లో ఎలక్షన్‌ అక్రమాలపై హైకోర్టులో పిటీషన్లు ఉన్నవి. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే 18 సీట్లు మరో 6 నెలలలోపు కోల్పోవాల్సి వస్తుంది. అల్లుడు హరీశ్ తో  ప్రమాదంలో ప్రభుత్వం పడితే 30 దాక ఎమ్మెల్యేలు జారిపోయినా గానీ, 61 సీట్లతో ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనే కుటిల నీతి ఈ అక్రమ వలసలను ప్రోత్పహిస్తోంది. 16 ఎంపీ సీట్లు ఎలాగైనా గెలవక పోతే రేపు రాబోయే ప్రభుత్వంతో సమస్యలు రావచ్చనే భయం. మోడీ దగ్గర 15 ఎంపీలతో గులాం గిరి చేసి తన మీద ఉన్న సీబీఐ కేసుల నుండి ఉపశమనం పొందాడు. రేపు కాంగ్రెస్‌ అనుకూల ప్రభుత్వం వస్తే తన ప్రభుత్వం ప్రమాదంలో పడకుండా చూసుకునే ఎత్తుగడే తప్పటి కాదు. 15 సీట్లతో కనీసం బొంగరం తిప్పి ఉంటే… 16 సీట్లతో చక్రం తిప్పుతాడు అనుకోవచ్చు.అదనంగా వచ్చే ఒక్క సీటుతో అద్భుతాలు సృష్టిస్తా అంటే నమ్ముతారా!

తండ్రి ప్రధాని.. కొడుకు ముఖ్యమంత్రి!

కొడుకును ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి ప్రధాని కావాలని కోరుకుంటున్నాడు.అదే విషయాన్ని ప్రజల్లో పదే పదే ప్రచారం చేస్తున్నారు.16 సీట్లతో ప్రధానమంత్రినవుతానని ప్రజల ఓట్లకు గాలం వేసి ఈ ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొం దాలనే ఎత్తుగడ. 543 స్థానాల్లో ఈయనతో కలసి వచ్చేవారెవరు?ఒక్క జగన్‌ తప్ప మరెవరూ కనపడడం లేదు. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, బీజేడీ… ఈ పార్టీల అధినేతలు ఎవరికివారు ప్రధాన మంత్రులు కావాలనుకునేవారే.కేసీఆర్ ని ముందు పెట్టి ఆయన వెనుక రాజకీయాలు చేయాలనుకునేవారు ఎవరున్నారు? మొన్నటికి మొన్న మమతా బెనర్జీపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంటే కనీసం పలకరించని కేసీఆర్ ని ఆమె నమ్ముతుందా? పైగా తను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా అన్న చంద్రబాబు తరఫున ఆమె ప్రచారం చేయడం విశేషం. బీజేడీ గోడ మీద పిల్లి వాటంగా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో కొనసాగే నైజం. ఎస్పీ, బీఎస్పీ ద్వయం కాంగ్రెస్‌ పార్టీతో అవగాహనతో ఉన్నారు. బీహార్ లో నితీశ్‌ మోడీ వైపు ఉండగా, తేజస్వీ యాదవ్‌ కాంగ్రెస్‌ వైపు ఉన్నాడు. కర్నాటకలో జేడీఎస్ కు టీఆర్‌ఎస్‌ మద్దతిస్తే కాంగ్రెస్ తో కలిసి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుని ఉండవచ్చు. కానీ,ఆ పేరు మీద కొడుకును ముఖ్యమంత్రి చేస్తానంటే తెలంగాణ ప్రజలు అంగీకరించరు. ఇంతకంటే దురాశ మరొకటి ఉండదు. ఇప్పటికీ ఆ కుటుంబం నుండి ఆరుగురు ప్రధాన భూమికల్లో ఉన్నారు.కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌, వినోద్‌, సంతోష్‌..ఈ ఆరుగురు పార్టీని , ప్రభుత్వాన్ని శాసిస్తూ ప్రజాస్వామ్యంలో రాజరికాన్ని కొనసాగిం చడమే తెలంగాణ ప్రజలకు నచ్చట్లేదు. సకల జనులు సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణను కుటుంబం చేతిలో బందీగా మార్చామనే అనుకుంటున్నారు.ఇది చాలదన్నట్లుగా తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని కేంద్రంలో చక్రం తిప్పాలనే పేరుతో ప్రజాదుర్వినియోగం చేస్తున్నాడు.

పక్క రాష్ట్రంలో ఉన్న జగన్ కు 1000 కోట్లు పంపిస్తున్నారంటే కేసీఆర్ కు ఇంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది? జేడీఎస్ తో పాటు మరికొన్ని ఉత్తర భారత పార్టీలకు మాత్రం రాష్ట్రా ల్లో ఉన్న కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుండే కదా! ప్రభుత్వ సొమ్ము నుండే యాగాలు చేసినట్టు ప్రభుత్వ సొమ్ము నుండే మొక్కులు చెల్లించినట్టుప్రభుత్వ సొమ్ములతోనే రాజకీయ పార్టీలకు చందాలిస్తున్నారు. ఈవీఎం మేనేజ్ మెంట్ల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అడిగే వ్యవస్థ వైఫల్యం ,కేంద్ర ప్రభుత్వం ధృతరాష్ట్రులుగా వ్యవహరిస్తూ తన ముందు అవినీతి, అక్రమాలు తెలంగాణలో జరుగుతున్న కిమ్మనకుండా టీఆర్‌ఎస్ ని సమర్ధిస్తుంది. కాంగ్రెస్‌ వ్యతిరేకంగా మారి మోడీ ప్రాపకం కోసం కేసీఆర్‌ చేసే ప్రయత్నాలు మోడీకి సంతోషన్నిస్తున్నాయి.

ఈవీయంలు లేకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ లేదు. సాక్షాత్తు ఎలక్షన్‌ కమిషన్ నే మేనేజ్‌ చేసే స్థాయికి వెళ్లారంటే ఎంత అవినీతి చేస్తున్నారో అర్థమవుతోంది. నిజామాబాద్‌ రైతులు 160 మందికి పైగా ‘మాకు బ్యాలెట్‌ కావాలంటే’, లేదు ఈవీఎం పెడతానని ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్షన్‌ ఈవీఎంను తయారు చేశారు. దీనికి కారణం 3 ఎమ్మెల్సీల ఎన్నికల్లో బ్యాలెట్ తో పోతే ప్రజలు తిరస్కరించడమే. మనుషులు ఓటేస్తే ప్రతి పక్షం గెలుస్తుంది. మిషన్ లు ఓటేస్తే టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది. ఇప్పటికే సీపీఎం పని అయిపోయిందని అందరూ అనుకుంటుంటే..నల్గొండ ఎమ్మెల్సీ సీపీఎం బలపరచినవారు గెలిచారు. అంటే, ప్రజల్లో ప్రతిపక్షాలు బతకాలనే కోరిక బలంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. తెలంగాణా ప్రజాస్వామిక  ప్రాంతం అక్కడ బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పెంచాలనుకుంటున్నాడు.

మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లలో ఒక్క బూత్ లోనూ మెజార్టీ రాని సీనియర్‌ కాం గ్రెస్‌ నాయకుడికి పట్టభద్రుల ఎమ్మెల్సీలో 39,000 మెజారిటీ వచ్చింది. అది ప్రజలు ఓటు వేయడం వల్లనే. 88 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన కేసీఆర్ కు 60 రోజుల్లోనే ప్రజలు 3 ఎమ్మెల్సీలను ఓడించి గుణపాఠం చెప్పారు. మళ్లీ ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కావాల్సి వస్తుంది. తెలంగాణ సమాజానికి జాతీయ స్థాయిలో తలవంపులు తెస్తున్న కేసీఆర్‌ పరివార్ కు ఈ సార్వత్రిక ఎన్నికల్లోప్రజలు తగిన గుణపాఠం నేర్పాలి. ‘తెలంగాణ అంటే నా జాగీరు. ఇక్కడ ఎం జేసినా చెల్లుతుంద’నే నియంతృత్వ ధోరణికి అడ్డుకట్ట వేయాలి. తండ్రి ప్రధాని, కొడుకు ముఖ్యమంత్రి. మేమే దేశమంతా అని అధికార మత్తులో అహంభావంతో తూగుతున్న కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజల సహించరు. ప్రజలు తిరగబడే రోజులు వచ్చినయ్‌ తస్మాత్‌ జాగ్రత్త.

“అద్దంకి దయాకర్ (అధికార ప్రతినిధి – తెలంగాణ పీసీసీ)”