వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఎదిగిన తెలంగాణ మూడు నెలల్లోనే దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. సూర్యపేట జిల్లాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు.
రైతుల కోసం తమ ప్రభుత్వంలో స్పష్టమైన విధానాలు తీసుకువచ్చామని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పంజాబ్ కు పోటీ పడలే పంట పండిందన్నారు. మూడు నెలల్లోనే తెలంగాణలో రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. తమ పాలనలో ట్యాంకర్లు, బిందెలు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయని ప్రశ్నించారు కేసీఆర్. ఇప్పుడు మళ్లీ బిందెలతో ప్రజలు రోడ్డు మీదికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
తాము రూపాయికే నల్లా కనెక్షన్, ఫ్రీ వాటర్ ఇచ్చామన్నారు . 35వేల కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ రంగాన్ని బాగుచేసి.. 24 గంటలూ కరెంట్ ఇచ్చామని తెలిపారు. స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అధికార పార్టీ అవివేకం, తెలివితక్కువతనం, అవగాహనారాహిత్యం క్లియర్‌గా కనిపిస్తోందన్నారు. ఉన్న కరెంట్ ను వాడుకునే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పంజాబ్ కు పోటీ పడలే పంట పండిందన్నారు. మూడు నెలల్లోనే తెలంగాణలో రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు.
ప్రభుత్వ అసమర్థత, అలసత్వం కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందన్నారు కేసీఆర్. మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా తాము మార్చామని.. రాత్రింబళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయించామని తెలిపారు. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.