హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై కేసీఆర్ ఫోకస్ పెంచారు. అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న ఆయన.. ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలోని జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కామారెడ్డిలో రూ.6 కోట్ల సొంత నిధులతో స్కూల్ నిర్మించిన సుభాష్ రెడ్డిని కేసీఆర్ అభినందించారు.
రాజకీయాల్లో ఆయన సేవలు ఎంతో అవసరమని, కామారెడ్డి నియోజకవర్గంలో తనతో కలిసి పని చేయాలని ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానంపై సుభాష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కామారెడ్డిలో కేసీఆర్ కోసం పనిచేస్తానని తెలిపారు.