
హైదరాబాద్: అసైన్డ్ భూముల్ని దోచుకోవడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారన్నారు జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా, పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికేవిధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని.. జీవనోపాధిని దూరం చేసుకోకుండా.. అమ్ముకోవడానికి వీల్లేదు అని చిన్న క్లాజు పెట్టడం జరిగిందన్నారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసైన్డ్ భూములపై దృష్టిపెట్టి లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ భూమి.. ఇక మాకు రాదు కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నామని.. అండర్ గ్రౌండ్ లో చాలా వేగంగా రాయించుకుంటున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. అన్ని జిల్లాల్లో నిషేదిత భూమిని అధికారులే తెల్లకాగితాలపై రాయించుకుంటున్నారని ఆరోపించారు.
భయపెట్టి.. బ్లాక్ మెయిల్ చేసి భూములు లాక్కుంటున్నారు
అసైన్డ్ భూములను భయపెట్టి.. బ్లాక్ మెయిల్ చేసి లాక్కుని.. వాటిని వేరే రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్నాయని భయపెట్టి.. బెదిరించి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో భూములు కొనేశారని.. 90 శాతం భూమి రైతుల వద్ద లేదని.. అంతా కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఆక్రమణలోనే ఉన్నాయన్నారు.
కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి
కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) చెప్పే లెక్కలకు, కేంద్ర చెబుతున్న లెక్కలకు పొంతనలేదన్నారు. కరోనా టైంలో ఎక్కడ మరణాలను రికార్డులోకి ఎక్కించలేదన్నారు. గ్రామస్థాయిలో కరోనా మరణాలపై కలెక్టర్లు, డీఎంహెచ్ ఓలతో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు
దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి