రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటంపై వస్తున్న విమర్శలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు విడదల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారని.. ఇప్పుడు ఎందుకు గాయ్ గాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్ లకు చురకలు అంటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే.. ఖాళీ కుండలే ఉన్నాయి.. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుని వెళ్లిందంటూ స్పష్టం చేశారు. మేం లంకె బిందెలు అని వస్తే.. ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని.. ఇప్పుడు అంతా సెట్ రైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. గతంలో నాలుగు నెలలపాటు వేస్తూ వచ్చారని.. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన మొదలుపెట్టారని.. ఇప్పుడు డిసెంబర్ 20వ తేదీ నుంచి నిధుల జమ చేస్తూ వస్తున్నట్లు వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం.. అన్ని ఖాతాలను ఖాళీ చేసి వెళ్లాడని.. ఖాజానా ఖాళీ చేసి వెళ్లాడని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.