
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏప్రిల్ 10 బుధవారం రోజున జగిత్యాలకు వెళ్లనున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి మాకునూరి హనుమంతరావు కన్నుమూయడంతో సంజయ్ ను పరామర్శించేందుకు కేసీఆర్ అక్కడికి వెళ్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించే 13వ రోజు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. హనుమంతరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మాకునూరి హనుమంతరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జగిత్యాల హౌసింగ్ బోర్డుకాలనీలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కొడుకులు సంజయ్, సందీప్‌కుమార్, కూతురు రజిత ఉన్నారు.