దళితులను కేసీఆర్ మోసం చేసిండు : ఎమ్మెల్యే వివేక్

దళితులను కేసీఆర్ మోసం చేసిండు : ఎమ్మెల్యే వివేక్
  • రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తానని విస్మరించిండు: ఎమ్మెల్యే వివేక్
  • పదేండ్లు దళితుల అభివృద్ధిని పట్టించుకోలే
  • దళిత కౌలు రైతులకు కేటీఆర్ రైతుబంధు అడ్డుకున్నడు
  • రాజ్యాంగాన్ని మార్చేందుకు కొందరు కుట్ర చేస్తున్నరని ఫైర్
  • సంగారెడ్డిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: దళితులను ధనికులు చేయడమే తమ లక్ష్యం అంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మోసం చేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. దళిత కౌలు రైతులకు రైతుబంధు అందకుండా కేటీఆర్​ అడ్డుకున్నారని మండిపడ్డారు. దళితుల అభివృద్ధికి రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తామంటూ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ హామీ ఇస్తూ విస్మరించారని ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్ చౌరస్తాలో మహర్ సేన ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివేక్ మాట్లాడారు. ‘‘అంబేద్కర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి. 

దేశంలోని అన్ని వర్గాలకు రాజ్యాంగంతో మేలు జరుగుతున్నది. అలాంటి రాజ్యాంగాన్ని నీరుగార్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ఏకం అవుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే కారణం. రాజ్యాంగం ఒక్క దళిత జాతికే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతున్నది. అంబేద్కర్ విలువలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. దేశశ్రేయస్సు కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందంటే కారణం రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతున్నది’’ అని వివేక్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చదువు అవసరం అని తెలిపారు. కలిసికట్టుగా పోరాడితేనే ఏదైనా సాధిస్తామన్నారు.

తండ్రికి తగ్గ తనయుడు వివేక్: ఎంపీ షెట్కార్

దళిత జాతి ముద్దుబిడ్డ వెంకటస్వామి కుటుంబం అంటేనే ప్రతి ఒక్కరికి అభిమానమని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. దళిత జాతి కోసం శ్రమించిన మహనీయుడు కాకా అని కొనియాడారు. తండ్రికి తగ్గ తనయుడు ఎమ్మెల్యే వివేక్ అని, దళిత సమాజానికి సేవ చేయాలని నిరంతరం శ్రమిస్తుంటారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాంటి వ్యక్తిని మంత్రిగా చూడాలని దళిత జాతి కోరుకుంటున్నదని తెలిపారు.

ప్రతిచోట అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలి: గద్దర్ కూతురు వెన్నెల

డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు ప్రతిచోట ఉండాలని గద్దర్ కూతురు వెన్నెల అన్నారు. అంబేద్కర్ విగ్రహాలను చూస్తే దోపిడీదారులకు భయం వేస్తుందన్నారు. అందుకే ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తూ రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్, అధికార, ప్రతిపక్ష పార్టీ లీడర్లు తబసమ్ ఆస్మా, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సిద్ధి లింగయ్య స్వామి, జగన్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహమూద్ అలీ, మహమ్మద్ సిరాజ్, గౌసొద్దీన్, నిరంజన్ రెడ్డి, బలరాం రెడ్డి, రత్నం, విల్, చంద్రప్ప, ఆనందీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే మా ధ్యేయం

ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఎన్నికల టైమ్​లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు దిశగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. జహీరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేండ్లలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు.

 కానీ.. కేసీఆర్ మాత్రం 100 పడకల ప్రగతి భవన్ కట్టుకున్నారు. తన కూతురు, కొడుకుకు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు నిర్మించి ఇచ్చాడు’’అని వివేక్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తనతో పాటు వెంకటస్వామి పార్లమెంట్​లో పోరాటం చేశారని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్​ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ జహీరాబాద్ ఇన్​చార్జ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ లీడర్లు తన్వీర్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


ప్రజా సంక్షేమమే మా ధ్యేయం
ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఎన్నికల టైమ్​లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు దిశగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. జహీరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేండ్లలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. కానీ.. కేసీఆర్ మాత్రం 100 పడకల ప్రగతి భవన్ కట్టుకున్నారు. తన కూతురు, కొడుకుకు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు నిర్మించి ఇచ్చాడు’’అని వివేక్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తనతో పాటు వెంకటస్వామి పార్లమెంట్​లో పోరాటం చేశారని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్​ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ జహీరాబాద్ ఇన్​చార్జ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ లీడర్లు తన్వీర్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఎస్సీ ఎంటర్​ప్రెన్యూర్స్ ​నుంచి 15%  సామగ్రి కొనాలి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం కొనుగోలు చేసే సామగ్రిలో 15 శాతం ఎస్సీ ఎంటర్​ప్రెన్యూర్స్ నుంచి సేకరించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ అంశంపై ప్రకటన చేయాలన్నారు.  మీడియాకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏడాది దళితుల అభ్యన్నతి కోసం ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేస్తుందన్నారు. ఈ ఏడాది ఈ ప్రకటన చేయాలని కోరారు. దళితులకు ఇచ్చిన హామీ మేరకు చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.