అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి... ఆర్డీవో ఆఫీస్ ముందు బీజేపీ లీడర్ల ధర్నా

బెల్లంపల్లి, వెలుగు: అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్ ఆధ్వర్యంలో పేదలతో కలిసి గురువారం బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. మాయమాటలు, అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూంలు పంపిణీ చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు.

ALSO READ :మూసీకి పెరిగిన వరద

వెంటనే పేదలకు ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్​చేశారు. అనంతరం ఇండ్ల దరఖాస్తులను ఏవో పుష్పలతకు అందజేశారు. బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనకం విజయ్, ఉపాధ్యక్షుడు మేకల రాజశేఖర్, సీనియర్ లీడర్లు రేవెల్లి రాజలింగు, రామ్ చందర్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.