హైదరాబాద్, వెలుగు: బాలానగర్‌లో నిర్మించిన ఫ్లై ఓవర్‌కి రాష్ట్ర ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టింది. భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.
దేశంలో సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని, ఆయన దేశానికి అందించిన సేవలు చిరకాలం గుర్తుండేలా బాలానగర్ ఫ్లై ఓవర్‌కి ఆయన పేరు పెట్టినట్లు పేర్కొంది.