మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ రాజగోపాల్ రిటైర్మెంట్సందర్భంగా శుక్రవారం కాలేజీలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. గతంలో మన స్టేట్‌లోని యూనివర్సిటీలు దేశంలో ఫస్ట్, సెకండ్ స్థానాల్లో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక లిస్టులో లేకుండా పోయాయన్నారు.
ఉమ్మడి ఏపీలో కొట్లాడి తీసుకొచ్చిన డెయిరీ టెక్నాలజీ కాలేజీ సొంత స్టేట్‌లో ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించామని, అలా జరగలేదన్నారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్ల కొరత ఉందన్నారు. కాలేజీ అభివృద్ధికి ప్రొఫెసర్రాజగోపాల్ ఎంతో శ్రమించారని, వారి సేవలు ఎనలేనివన్నారు. లీడర్లు చంద్రకాంత్‌రెడ్డి, గొనే శ్రీనివాస్, చంద్రశేఖర్, సందీప్పాల్గొన్నారు.