
హైదరాబాద్:రాష్ట్రంలో ఉపఎన్నికలలు వస్తాయి..సిద్దంగా ఉండాలని యువ నేతలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణలో మళ్లీ మనదే అధికారం..మీరే ఎమ్మెల్యేలు..భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయాలన్నారు కేసీఆర్.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది.. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ యువనేతలను సంసిద్ధం చేశారు కేసీఆర్.
గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అక్కడ యువ నేతలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కష్టనష్టాలను యువనేతలకు వివరించారు కేసీఆర్.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు.. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదు.. బీఆర్ఎస్ హయాంలో ప్రతి సంవత్సరం రాష్ట్రఆదాయం పెంచుకుంటూ పోయాం..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుంది..అప్పటి అధికారులే ఇప్పుడూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి పనిచేయించుకోవడం రావడం లేదని విమర్శించారు కేసీఆర్.