తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం:కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అన్నారు మాజీ సీఎం, బీఆర్ ఎస్ నేత కేసీఆర్.  ఆదివారం ( డిసెంరబ్ 8) ఎర్రవెల్లి ఫాంహౌజ్ లో జరిగిన బీఆర్ ఎష్ ఎల్పీ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 

నాడు రైతు బంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ చెప్పాలన్నారు. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలన్నారు. విగ్రహం మార్పు మూర్ఖత్వం, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ఇలా మార్పులు చేసుకుంటే పోతే ఎట్ల అని ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు కేసీఆర్. రాష్ట్రంలో నిర్భంధ పాలన కొనసాగుతోంది.. ఈ విషయాన్ని సమావేశాల్లో ప్రస్తావించాలని సభ్యులకు సూచించారు. ఫార్మాసిటి ఎందుకు ప్రతిపాదించింది.. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు వివరించాలని చెప్పారు కేసీఆర్. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రోటోకాల్ విషయంపై నిలదీయాలన్నారు కేసీఆర్.. కాంగ్రెస్ మేనిఫెస్టో వైఫల్యాలను ఎత్తిచూపాలని చెప్పారు. ఫిబ్రవరిలో పార్టీ బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరిని ఎండగడతామన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఫిబ్రవరి తర్వాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు, ఆతర్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వస్తామని బీఆర్ ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు.