మనఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్

మనఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్

ప్రభుత్వ విద్యారంగాన్ని పఠిష్టం చేసేందుకే మనఊరు మన బడి కార్యక్రమం అని అన్నారు సీఎం కేసీఆర్. ప్రతీ ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తామన్నారు. వనపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ లో మనఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు కేసీఆర్. సర్కారు బడుల్లో చక్కటి వసతులు కల్పిస్తున్నామన్నారు.  విద్యార్థులంతా శ్రద్దగా చదువుకోవాలని..తామంతా సర్కారు బడుల్లో చదివిన వాళ్లమేనన్నారు.

రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడికి శ్రీకారం చుట్టారు సీఎం. రాష్ట్రంలోని మొత్తం 26 వేల 65 పాఠశాలలను ఈ పథకం కింద అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు మొత్తం 7 వేల 289 కోట్లు ఖర్చు చేయనున్నారు. మూడు విడతల్లో మూడేళ్లలో ఈ కార్యక్రమం పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.