అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్​దే

సిరిసిల్ల టౌన్, వెలుగు: కేసీఆర్ రాష్ట్రాన్ని  అప్పుల తెలంగాణగా మార్చాడని   మహిళ కాంగ్రెస్​ స్టేట్ ప్రెసిడెంట్ సునీత రావు అన్నారు. రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ లో భాగంగా శనివారం రాజన్న సిరిసిల్ల లో పర్యటించారు. బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తూ ధనం దోసుకుతుంటుందని పేర్కొన్నారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు ఇచ్చారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కడి కూడా నేరవేర్చలేదని తెలిపారు. 

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు  ప్రజలు బుద్ధి చెప్పుతారని అన్నారు. అనంతరం పార్టీకార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మహిళ ప్రెసిడెంట్ కాములువనిత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్​చార్జి పద్మ , స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సత్య లక్ష్మి , మడుపు శ్రీదేవి, స్వరూప పాల్గొన్నారు.