హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జెండా ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి దండం పెట్టారు. ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేటితో టీఆర్ఎస్ పార్టీ 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ సారి పార్టీ ఆవిర్భావ వేడుకలు టీఆర్ఎస్ దూరంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా సీఎం కేసీఆర్ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ…మాస్క్ కట్టుకొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కూడా తక్కువ మంది నేతలే వచ్చారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఐతే టీఆర్ఎస్ శ్రేణులు ఇళ్ల వద్ద పార్టీ జెండాను ఎగురవేసి ఉత్సవాలు జరుపుకోనున్నారు. టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధించిందన్నారు. ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించిందని…దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.
తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఎగిరేసిన కేసీఆర్
- Telugu States
- April 27, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే దారుణం..మణిపూర్‌లో జవాన్లపై కాల్పులు
- Viral news: ఈ ఆవు ఉన్న రైతుకు డబ్బేడబ్బు..రోజుకు 82 లీటర్ల పాలు ఇచ్చే మేలుజాతి ఆవు
- పృథ్వీ సారీ చెప్పిన జాలిపడని వైసీపీ క్యాడర్.. #DisasterLaila మొదలెట్టారు
- బిగుస్తున్న ఉచ్చు.. వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం
- ముగిసిన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..
- Viral video: వీళ్ల పనే బాగుంది..ఫోన్ ఛార్జింగ్ చేస్తూ..గంటకు రూ.1000 సంపాదన
- Pakistan Cricket: హద్దుమీరిన పాక్ క్రికెటర్లు.. ఒకేసారి ముగ్గురికి జరిమానా
- కృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
- FASTag కొత్త రూల్స్..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లో పోచంపల్లి ఫౌంహౌస్ దందా..టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Most Read News
- మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్.. ఏపీలో తొలి కేసు నమోదు
- ట్రిపుల్ ఆర్ దాటాక 5కి.మీ వరకు హెచ్ఎండీఏ.!..కొత్తగా చేరే మండలాలు, గ్రామాలు ఇవే..
- జ్యోతిష్యం: ఫిబ్రవరి 27 న మీనరాశిలోకి బుధుడు... రాహువుతో కలయిక... 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!
- చిరంజీవి ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు..? ఫుల్ డీటైల్స్ ఇవే..
- భార్య నోటికి ఫెవిక్విక్ వేసిన భర్త.. ఎందుకిలా చేశావని పోలీసులు అడిగితే..
- లోక్‌సభలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు: మార్పులు, చేర్పులు ఇవే
- IND vs ENG: ఊకో ఊకో బాధపడకు.. కోహ్లీని ఓదార్చిన రోహిత్
- ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపిన కొడుకు..మూడు రోజులుగా ఇంటి ముందే డెడ్‌బాడీ
- ఏపీలో మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్..కలెక్టర్ ఏమన్నారంటే.?
- సినిమా స్టంట్ కాదు.. రియల్ యాక్సిడెంట్ : ర్యాపిడో బైక్ డ్రైవర్ ఓవర్ స్పీడ్