కాసేపట్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలనున్నారు రాష్ట్రమంత్రులు. బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, ఇతర అంశాలపై మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి క్లారిటీ తీసుకోనున్నారు మంత్రులు. గోయల్ తో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల, టీఆర్ఎస్ ఎంపీలు, అధికారులు భేటీ కానున్నారు.
మరోవైపు వడ్ల కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ మూడో రోజు క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. నిన్న ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఇవాళ కూడా సేమ్ సీన్. ప్రధాని, కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని ఇవాళో, రేపో అపాయింట్ మెంట్ వస్తుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు.