మహబూబాబాద్ కలెక్టరేట్ ను ప్రారంభించిన కేసీఆర్

మహబూబాబాద్ లో సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత,పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు.  కాసేపట్లో జిల్లా ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ కానున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం వెళ్లనున్నారు.

పాల్వంచలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్​ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు. కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​ను ప్రారంభిస్తారు.  మరో వైపు సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ప్రతిపక్ష నేతలను నిన్న రాత్రి నుంచి ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.