అసెంబ్లీకి అరగంట ముందే వెళ్ళండి..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశం

అసెంబ్లీకి అరగంట ముందే వెళ్ళండి..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. అరగంట ముందే అసంబ్లీకి రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. 9 గంటల 30నిమిషాలకే అసెంబ్లీలో ఉండాలని.. ప్రతిరోజూ తప్పకుండా అసెంబ్లీకి రావాలని అన్నారు కేసీఆర్. ఎల్పీలో సమావేశం పెట్టుకొని అసెంబ్లీలోకి వెళ్లాలని అన్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని అన్నారు కేసీఆర్.

తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని అన్నారు. బీఆర్ఎస్ మీద  ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో నెలకొన్న  పలు సమస్యలు....ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీలో మండలిలో పోరాడాలని అన్నారు కేసీఆర్.

బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలని అన్నారు కేసీఆర్.ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగు, పీఆర్సీ అమలు పై అసెంబ్లీ, మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలని... గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలుపై అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు కేసీఆర్.