
హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి రావాల్సిందిగా మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌ను గుట్ట పూజారులు ఆహ్వానించా రు. ఈ నెల 23న నిర్వహించనున్న ఈ కార్యక్ర మానికి సంబంధించి శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను యాదగిరి గుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారుల బృందం కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. అలాగే, మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకూ రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.