- మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నిజామాబాద్: కేసీఆర్ రాజకీయాల కోసం ఉత్సవాలను మారుస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులను భయపెట్టి బలవంతంగా ఉత్సవాలు చేయిస్తున్నారని.. 8 ఏళ్లుగా కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని ఆరోపించారు. జిల్లా జైలును మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17 సమైక్యతా దినం కాదు విమోచన దినం అన్నారు. రజాకార్ల నుంచి విముక్తి అయిన రోజు సెప్టెంబర్ 17 అని గుర్తు చేశారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని.. ఇంగ్లండ్లో చదివిన అసదుద్దీన్కు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. తెలంగాణ కోటి రతనాల వీణను కేసీఆర్ కోటి అబద్ధాల ముఠాగా మార్చారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.