వేములవాడ ఆలయ అభివృద్దికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు : ఇంద్రకరణ్ రెడ్డి

వేములవాడ ఆలయ అభివృద్దికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే వేములవాడ ఆలయం భక్తుల సందర్శనలో, ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. రాజన్న ఆలయానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారని చెప్పారు . అభివృద్ధిలో భాగంగా గుడిచెరువులో 35 ఎకరాలు తీసుకున్నామని మంత్రి  తెలిపారు. శివరాత్రి వేడుకలను మూడు రోజులు వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మరోవైపు మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు వేములవాడ ఆలయం ముస్తాబైంది. సుమారు 3 కోట్ల 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భారీ ఏర్పాట్లు చేశారు.  జాతర కోసం వచ్చే భక్తుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేశారు.