
- బీఆర్ఎస్ సర్కారును ఓడగొట్టాలె
- కామారెడ్డిలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి టౌన్, వెలుగు : గత ఎన్నికల్లో బీఆర్ఎస్ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరేవేర్చలేదని, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని పాండిచ్చేరి మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నారాయణ స్వామి పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన మీటింగ్, పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు. మళ్లీ మూడోసారి సీఎం కావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దాన్ని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారన్నారు.
నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసగించారన్నారు. దేశంలో సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే పని చేసే ఏకైక సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లను కచ్చితంగా అమలు చేసి తీరతామన్నారు. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ విప్ఈరవత్రి అనిల్, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, నాయకులు కొండల్‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్పండ్ల రాజు, లీడర్లు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.