KCR కు విమర్శించడమే తెలుసు : కిషన్ రెడ్డి

KCR కు విమర్శించడమే తెలుసు : కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్,కేటీఆర్ ప్రధాని మోడీ పై దిగజారుడు విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ తో గెలవాలని చూస్తోందన్నారు. జాతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమం గురించి మాట్లాడే ముందు టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

కేసీఆర్ కు విమర్శించడం తప్ప మరొకటి తెలియదన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. ప్రధాని ని ఏమాత్రం గౌరవం లేకుండా ఏక వచనంతో మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందిన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. పథకాలకు ఎక్కడినుండి నిధులు తెస్తారన్నారు.

తెలంగాణలో మోడీ గాలి బలంగా వేస్తోంని….అందుకే కేసీఆర్, కేటీఆర్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు బీజేపీకి ఇవ్వండి….తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళే బాధ్యత మాది అన్నారు కిషన్ రెడ్డి.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, టెంట్ పీకేశారు…ఇప్పుడు నేషనల్ పార్టీ అంటున్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో గెలవాలి అనుకుంటున్న కేసీఆర్…పార్లమెంట్ ఎన్నికల్లో వ్యాపారస్తులకు, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు  టికెట్స్ ఇచ్చారని ఆరోపించారు. మిషన్ భగీరథ పూర్తి కాకుంటే ఓట్లు అడుగబోనన్న కేసీఆర్… అన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నారన్నారు.

దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం రోజు రోజుకు పెరుగుతోందన్న కిషన్ రెడ్డి…రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు సరెండరయ్యిందన్నారు. 60 ఏళ్లు దాటిన రైతులకు… రైతు పెన్షన్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో  ప్రకటించడం సంతోషకరంగా ఉందన్నారు. ఇది తెలంగాణ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు కిషన్ రెడ్డి.