వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై కేసీఆర్ అసంతృప్తి
హనుమకొండ/ వరంగల్, వెలుగు: వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిజైన్‌పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజైన్ అసలు బాగాలేదని, తనకు నచ్చలేదని, డిజైన్ ఇట్లనే ఉంటదా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌లోని అన్ని బ్లాకులు 24 ఫ్లోర్లుగా ఉండాలని, కొన్ని 10, 14 ఫ్లోర్లు మాత్రమే ఎందుకు నిర్మిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. డిజైన్ మార్పు గురించి దసరా తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను శనివారం ఆయన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్ అండ్ బీ ఆఫీసర్లు హెల్త్ సిటీ ప్లాన్‌ను సీఎంకు వివరించారు. ప్లాన్ సరిగా లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్, క్లాసెస్, హాస్టళ్ల గురించి ఫోన్లలో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
సీఎం వస్తున్నారని రోడ్డు వేశారు.
జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను వరంగల్ భద్రకాళి ఆలయానికి తీసుకెళ్లాలని ప్రభుత్వ చీప్ విప్ వినయ్ భాస్కర్ అనుకున్నారు. మెయిన్ రోడ్డు నుంచి భద్రకాళి ఆలయం వరకు కిలోమీటర్ రోడ్డు గుంతలు పడి ఉండటంతో శుక్రవారం రేయింబవళ్లు కష్టపడి కొత్త రోడ్డు వేశారు. అయితే సమయం లేకపోవడంతో భద్రకాళి ఆలయానికి సీఎం వెళ్లలేదు.
వరంగల్ దవాఖానపై నుంచి చూస్తే హైదరాబాద్ కనపడ్తది
వరంగల్,కరీంనగర్,ఖమ్మం జిల్లాల జనం కోసం వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ బిల్డింగ్ పై నుంచి చూస్తే హైదరాబాద్ కనపడ్తదని అన్నారు..పేషెంట్లు ట్రీట్ మెంట్ కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తారని పేర్కొన్నారు.