వరంగల్కు కేసీఆర్.. తప్పని ముందస్తు అరెస్ట్లు

ములుగు రోడ్డులో నిర్మిం‌చిన ప్రతిమ క్యాన్సర్‌ ఇన్‌‌స్టి‌ట్యూ‌ట్‌ను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారం‌భిం‌చ‌ను‌న్నారు. ప్రారం‌భో‌త్సవం అనంతరం హాస్పిటల్ ప్రతినిధులు , అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో  కలిసి  సభలో పాల్గొంటారు . మధ్యాహ్నం  లంచ్ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. ఇప్పటికే  కేసీఆర్ పర్యటనకు సంబంధించిన  ఏర్పాట్లను  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. 

సీఎం కాన్వాయి నుంచి జారీ పడిన మహిళా కానిస్టేబుల్

వరంగల్ కు బయలుదేరే ముందు సీఎం కాన్వాయి నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ జారీ పడింది. ఆమెకు స్వల్పగాయాలు అయ్యాయి.

ముందస్తు అరెస్ట్

వరంగల్ లో  సీఎం టూర్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల్ని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ధరణి పోర్టల్ లో తమ ఊరు లేదంటూ కొద్ది రోజులుగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. సీఎం టూర్ ను అడ్డుకుంటారని ఉద్దేశంతో అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, MPTC తో పాటు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు.