తెలంగాణ దశాబ్ది ఉత్సావాలకు నేను రాను: కేసీఆర్

తెలంగాణ దశాబ్ది ఉత్సావాలకు నేను రాను: కేసీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. జూన్ 2న ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనదని లేఖలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోకడలను వీడి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

కాగా,  రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌‌ను సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు ఆహ్వాన పత్రికను కూడా ఆయనకు పంపారు.‌ సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రొటోకాల్‌‌ సలహాదారు హర్కర్‌‌ వేణుగోపాల్‌ ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందజేశారు.