రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల కుప్ప చేసిండు: బోరెడ్డి అయోధ్యరెడ్డి

ఒక్కొక్కరిపై రూ.2.22 లక్షల అప్పు మోపారు: బోరెడ్డి అయోధ్య రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ అప్పుల కుప్పగా మార్చారని పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి విమర్శించారు. మిత్తీలకే ఏటా రూ.18,911 కోట్లు కడ్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. అవినీతి పాలన, అసమర్థత కలిగిన నాయకత్వమే రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్ర సర్కారు ఒక్కొక్కరి మీద రూ.2.22 లక్షల అప్పు మోపిందని ఫైర్ అయ్యారు. 2015లో రాష్ట్ర అప్పు రూ.72,658 కోట్లు ఉండగా.. ఇప్పుడది రూ.3,66,306 కోట్లకు పెరిగిందన్నారు. 

ALSO READ :4 వారాల్లో వినియోగదారుల కమిషన్‌ చైర్మన్ ను నియమిస్తం

ఎనిమిదేండ్లలోనే అప్పులు ఐదు రెట్లు పెరిగాయని, రాష్ట్ర జీడీపీలో 28 శాతం అప్పులు ఉన్నాయన్నారు. కేసీఆర్​ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రూ.87 వేల కోట్లు, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐదేండ్లలో రూ.2 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఆయన ఆరోపించారు.