
కరీంనగర్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా గురువారం కరీంనగర్ లో నిర్వహించే కేసీఆర్ రోడ్‌షోను సక్సెస్ చేయాలని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులను కోరారు. బుధవారం కరీంనగర్ లోని తన నివాసంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్.రమణ, భానుప్రసాద్ రావు, మేయర్ యాదగిరి సునీల్ రావు , కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మేయర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గంగుల బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో 56 కేజీల కేకును కట్ చేశారు.