నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయింది : కేసీఆర్

నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయింది : కేసీఆర్
  • కాంగ్రెస్​కు ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు నాలిక కరుసుకుంటున్నరు: కేసీఆర్
  • ఇంకొన్ని రోజుల్లో మనల్నే వెతుక్కుంటూ వస్తరు
  • అప్పటి వరకు ఓపికగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచన
  • ఎర్రవల్లి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలు జిల్లాల కార్యకర్తలతో భేటీ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ఓటమితో పార్టీకి దిష్టి తీసినట్టయిందని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటేసినందుకు ఇప్పటికే ప్రజలు నాలుక కరుసుకుంటున్నారని, తెలంగాణ సమాజం తిరిగి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇంకొన్ని రోజుల తర్వాత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెతుక్కుంటూ ప్రజలే వస్తారని, అప్పటి వరకు ఓపికగా ఉండాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ సూచించారు. బుధవారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేడ్చల్,  నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రస్థానంలో విజయాలే తప్ప, అపజయాలు లేవన్నారు. సమైక్యవాదానికి సింబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న చంద్రబాబునే ఎదిరించి నిలిచామని, ఇప్పుడున్న ఆటంకాలను అలవోకగా దాటుకుంటూ ముందుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అండగా ఉంటుందన్నారు. హామీలు అమలు చేయడం చేతగాక జిమ్మిక్కులతో ప్రజలను కాంగ్రెస్ సర్కార్ పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు వస్తాయన్నారు. అప్పటిదాక ప్రజా సమస్యలపైన పోరాడాలని ఆయన సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. 

పిలిచినోళ్లే రావాలె

తనను కలవడానికి పిలిచిన వాళ్లు మాత్రమే రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పిలవనోళ్లు కూడా రావడం వల్ల అందరితో మాట్లాడడం వీలు కావడం లేదన్నారు. ‘‘నన్ను కలవడానికి వేలమంది వస్తున్నరు. మీ అభిమానానికి థ్యాంక్స్. అంతమందికి ఐదారు గంటలు నిలబడి ఫొటోలు దిగాల్నంటే కాలిరిగిన నాకు ఇబ్బంది అయితున్నది. వారానికి 2 నియోజకవర్గాల పేర్లు చెప్తం. చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చు” అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.