జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌

జగిత్యాలలో గురువు  జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌
  • జైశెట్టి రమణయ్యకు పుస్తకాలు  అందజేసిన మాజీ సీఎం 
  • ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు

జగిత్యాల టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాలకు వచ్చారు. ఈ క్రమంలో తనకు ఇంటర్​లో గురువైన ప్రముఖ కవి, రచయిత జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొన్ని పుస్తకాలను అందజేశారు. కొద్దిసేపు రమణయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. ‘నేను ఇంటర్ చదివేప్పుడు జై శెట్టి రమణయ్య సార్ మాకు హిస్టరీ సబ్జెక్ట్ చెప్పేటోడు’ అని  కేసీఆర్ ​గుర్తు చేసుకున్నారు.

జగిత్యాలలో కేసీఆర్​ బస్సు తనిఖీ 

జగిత్యాలలో సోమవారం కేసీఆర్‌‌ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ప్రచారంలో భాగంగా జగిత్యాల నుంచి  నిజామాబాద్‌ రోడ్ షో కి వెళ్తుండగా జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ వద్ద బస్సును ఆపారు. ఎఫ్‌ఎస్‌టీ జగిత్యాల ఇన్‌చార్జి  విజేందర్ రావు ఆధ్వర్యంలో బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పంపించారు.