తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రేడింగ్ కోసం న్యాక్ కు 2019లో అప్లై చేస్తే.. తప్పుడు పత్రాలు పెట్టారని న్యాక్ 5 ఏండ్లు నిషేధించిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. న్యాక్ నిషేధిస్తే.. కేసీఆర్ యూనివర్సిటీకి అనుమతిలిచ్చారని ఆరోపించారు. 420ని కేసీఆర్ మంత్రిని చేసి పక్కన కుర్చోపెట్టుకున్నాడన్నారు. నకిలీ పెట్టిన పెట్టిన దొంగ మల్లారెడ్డి అని అన్నారు. లంగ దొంగను వెనుకేసుకొస్తున్న.. కేసీఆర్, కేటీఆర్ లఫంగాలు కాదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ మూడు చింతలపల్లి ఊరిని దత్తత తీసుకుని..ఆ ఊరి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.ఆ ఊరిని అభివృద్ధిని చేస్తే..మేము ఎందుకు అక్కడ దీక్ష చేస్తామని ప్రశ్నించారు. ఇదే విషయంపై నిలదీసే ప్రయత్నం చేస్తే..ఇష్టం వచ్చినట్లు మాడారన్నారు. తిట్టుకుందాం అంటే.. ఎక్కడికి రమంటే అక్కడికి వస్తా.. ప్రగతి భవన్ కు రమన్నా వస్తా అని అన్నారు రేవంత్ రెడ్డి.