ఫామ్ హౌస్ లో నడక ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్.. (వీడియో)

ఫామ్ హౌస్ లో నడక ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్.. (వీడియో)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన ఫామ్​హౌస్ లో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల ఫామ్​హౌస్ లో కాలు జారి పడి తుంటి ఎముక విరిగడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్  నందినగర్ లో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. ఆరోగ్యం కుదటపడడంతో మళ్లీ ఫామ్ హౌస్ షిఫ్ట్ అయ్యారు. 

అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.  ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు  పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఊత కర్ర సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ నడుస్తున్న వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ఎక్స్  లో పోస్ట్ చేశారు. మరింత ధృఢ సంకల్పంతో త్వరలోనే కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారని పోస్ట్ లో తెలిపారు.

గత ఆదివారం ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో ఎవుసం చేసుకుంటానని, అవసరమైన ఎరువులు పంపాలని  ములుగు మండలం వంటిమామిడిలోని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం బాగుందని, గజ్వేల్​ వస్తానని... అందరిని కలుస్తానని చెప్పారు.