కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా? : కేసీఆర్

కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా?  : కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుతో సజీవ జలధారలను సృష్టించామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు.  గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేశామని చెప్పారు. నాలుగైదు నెలల్లో ఇవన్నీ ఎడారిగా మారాయని తెలిపారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించారు. అనంతరం సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.  


తెలంగాణలో  2014 రోజులు మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇది కాలం తేచ్చిన కరువు కాదని..  కాంగ్రెస్ తెచ్చిన కరువేనని కేసీఆర్ విమర్శించారు.  తెలంగాణలో 20 లక్షల మేర పంటలు ఎండిపోయిందని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పంటలు ఎండని జిల్లా లేదన్నారు.   ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు.

పంటలు ఎండిపోవడానికి కారణం నాణ్యతలేని కరెంట్ మరో కారణమని చెప్పారు. 200 మంది చనిపోయిన రైతులకు రూ.  25 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్. పరిహారం ఇవ్వకపోతే వారి ఉసురు తగులుతుందిన్నారు.  పరిహారం ఇవ్వకపోతే బీఆర్ఎస్ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  కల్యాణ లక్ష్మీ, తులం బంగారం, ఇంట్లో ఇద్దరికి  4 వేల పెన్షన్, పిల్లలకు బ్రేక్ ఫాస్ట్  ఎమయ్యాయని కేసీఆర్ ప్రశ్నించారు.