కేసీఆర్‌‌‌‌కు వైరల్​ ఫీవర్​.. కేటీఆర్‌‌‌‌ ట్వీట్

సీఎం కేసీఆర్‌‌‌‌ దగ్గు, జ్వరంతో  బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్‌‌‌‌కు వారం రోజుల నుంచి దగ్గు, వైరల్ ఫీవర్ ఉందని మంగళవారం సాయంత్రం కేటీఆర్‌‌‌‌ ట్వీట్ చేశారు. డాక్టర్ల బృందం ఇంట్లోనే ఆయనకు ట్రీట్‌‌మెంట్ ఇస్తున్నదన్నారు. 

త్వరలో  సీఎం కోలుకుంటారని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నారు. యశోద హాస్పిటల్‌‌కు చెందిన ఐదుగురు డాక్టర్ల బృందం కేసీఆర్‌‌‌‌కు ట్రీట్‌‌మెంట్ ఇస్తున్నట్టు ప్రగతిభవన్‌‌ వర్గాలు వెల్లడించాయి.