టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌లో అధికార గర్వం ఎక్కువైంది. నియంతృత్వ ధోరణితో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత ప్రజా వ్యతిరేకత రావడంతో భంగపోవడం ఆయన వంతైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సరిగా పట్టించుకున్న పాపానపోలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ముసలోళ్లకు ఆసరా పెన్షన్ పెంచుతామన్నారు, రూపాయి ఖర్చు లేకుండా పేదలకు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పారు, సొంత స్థలం ఉంటే ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ప్రభుత్వ సాయం అందిస్తామన్నారు.. ఇలా ఒకటా రెండా చెప్పుకొంటూ పోతే కేసీఆర్ ఎన్నికల హామీ పెద్ద చాంతాడంత అవుతుంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ సరిగా అమలులోకి రాలేదు. దాదాపు రెండేండ్లు గడుస్తున్నా వాటిని అమలు చేసే ఆలోచన కూడా చేయలేదు. వాటి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఏవేవో సంస్కరణలు అంటూ సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారు. 2020లో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. కానీ వీఆర్వోల స్థానంలో వాళ్ల డ్యూటీలు ఎవరు చేస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. భూరిజిస్ట్రేషన్లకు ట్రాన్స్‌పరెన్సీ కోసం కొత్త వ్యవస్థ అని చెప్పి ధరణి పోర్టల్ రూపొందించారు. కానీ దానితో కొత్త సమస్యలు రావడం, భూతగాదాలు ఎక్కువయ్యే పరిస్థితి కనిపించడం, ఆధార్, పాన్ డేటాకు ప్రైవసీ కొరవడడం, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతో ప్లాట్ల రెగ్యులైజేషన్ అని ప్రజల నుంచి భారీగా ఫీజలు వసూలు చేయడం ద్వారా వారిపై భారాన్ని మోపింది ప్రభుత్వం.
టీఆర్ఎస్ను తిప్పికొట్టిన ప్రజలు
సీఎం కేసీఆర్ నిర్ణయాలతో ఇబ్బందులు పడిన ప్రజలు ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పారు. దుబ్బాకలో ఉప ఎన్నిక రావడంతో అక్కడ అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి, అర్థంపర్థం లేని విధానాలను తిప్పికొట్టారు. ఆ బై ఎలక్షన్‌లో దెబ్బ తిన్న టీఆర్ఎస్, గ్రేటర్ ఎన్నికల్లో విక్టరీ సాధించి ఆ గాయానికి మందు వేసుకోవాలనుకుంది. ప్రతిపక్షాలకు టైమ్ లేకుండా చేయాలన్న వ్యూహంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను వేగంగా పెట్టేశారు. కానీ అనుకోని రీతిలో దాదాపు సగం వరకు సిట్టింగ్ కార్పొరేటర్ సీట్లను కోల్పోయింది. ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో గ్రేటర్ మేయర్ ఎన్నికపై సాగదీత విధానాన్ని అనుసరిస్తోంది. అదే భారీ విజయం సాధించి ఉంటే తాము తీసుకున్న అన్ని నిర్ణయాలు కరెక్ట్ అన్న ప్రొజెక్షన్ ప్రభుత్వం ఇచ్చేది. కానీ వరుస దెబ్బలు పడడంతో ఆలోచనలో పడింది. రాజకీయ వ్యూహం మార్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే నోటిఫికేషన్లా?
దాదాపు ఏడేండ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ గురించి పట్టించుకోని ప్రభుత్వం వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా మేలుకున్నట్టుంది. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న నిరుద్యోగ యువతను మాయ చేయడానికి అన్నట్టుగా సడన్ గా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. మరి ఇది త్వరలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఓట్ల కోసం కాక మరేంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజంగా సర్కారుకు నిరుద్యోగులపై ప్రేమ ఉంటే లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి ఇన్నేండ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నట్లు? ఇప్పుడు ఇస్తామన్న నోటిఫికేషన్లు కూడా ఫిబ్రవరి చివరిలో రిలీజ్ అవుతాయంటున్నారు.. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాక వాటి భర్తీ ఉంటుందని నమ్మడం ఎలా? ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి 2020 ఏడాది చివరి రోజున జీతాల పెంపు, రిటైర్మెంట్ వయసు పెంపు అంటూ రకరకాల వరాలు ప్రకటించేశారు. అనౌన్స్‌మెంట్ వచ్చింది కానీ దానిపైనా కమిటీ అన్నారు. అంటే ఆశల్లో పెట్టి ఎన్నాళ్లు ఎదురుచూసేలా చేస్తారో మరి! ఇదీ ఎన్నికల కోసమే అనుకోవాలా? గతంలో పీఆర్సీపై కమిటీ వేసి దాదాపు 30 నెలలుగా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నది అందరికీ తెలిసిందే. ఇలా సీఎం కేసీఆర్ ఇటీవల చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ ప్రజలను మరోసారి మాయ చేయడం ద్వారా రాజకీయంగా ప్రతిపక్షాలను దెబ్బకొట్టి.. తన ఉనికి కాపాడుకోవాలన్న లక్ష్యమే కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే తీసుకున్న నిర్ణయాల అమలులో ఆలస్యమెందుకుంటుందన్నది ప్రశ్న.
వరుస ఓటముల తర్వాత మారిన తీరు
వరుస ఓటములతో అన్ని విషయాల్లో టీఆర్ఎస్ సర్కారు రివర్స్ గేర్ వేసింది. ధరణి విషయంలో యూటర్న్ తీసుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం చెప్పిన పంట వేయాల్సిందేనని హెచ్చరించిన ప్రభుత్వం ఇప్పుడు నియంత్రిత సాగును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు కేంద్రం తెచ్చిన అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ సడన్ గా యూటర్న్ తీసుకుంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడ పోరాటం చేస్తున్న రైతులను కలవకుండా వెనక్కి వచ్చేయడంలో అర్థమేంటి? వాళ్లకు కనీసం సంఘీభావం తెలపకుండా రావడమంటే రైతు ఉద్యమంపై, అగ్రి చట్టాలపై అభిప్రాయం మార్చుకున్నట్టే అనుకోవాలా? ఒకవేళ అభిప్రాయం మార్చుకున్నా ఢిల్లీ వెళ్లి వచ్చాక వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేలా ఒక ప్రెస్ మీట్అయినా పెట్టాలి కదా! అదీ లేదు. పైగా ఉన్నట్టుండి ప్రభుత్వం ఇకపై రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని, ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలను ఎత్తేస్తున్నామని సీఎం ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా అసలు ముఖ్యమంత్రికి అగ్రి చట్టాల్లో ఏముందో కూడా అవగాహన లేనట్టు కనిపిస్తోంది. కేంద్రం తెచ్చిన చట్టాలు మంచివా కాదా అన్నది పక్కన పెడితే రాజకీయ కారణాలతో ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడంలో అర్థమేంటి? ప్రత్యర్థి పార్టీలను డిఫెన్స్‌లోకి నెట్టడమా? రాబోయే ఉప ఎన్నికల్లో ఉనికి నిలుపుకోవాలన్న లక్ష్యమా? ప్రజల మేలు కోసం అనుకుంటే దానిపై ప్రభుత్వం కచ్చితంగా క్లారిటీ ఇచ్చేదే కదా! -రచనారెడ్డి, న్యాయవాది.
మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ
నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు
పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం
ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ రివర్స్ గేర్
- వెలుగు ఓపెన్ పేజ్
- January 8, 2021
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు
- కార్తీకమాసం.. నవంబర్ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..