భగవంతుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడన్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఆరెస్ ఓడిపోయినా తనకు బాధ లేదని.. లక్షల మంది బీఆరెస్ క్యాడర్ తో ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు. ఏప్రిల్ 25వ తేదీ గురువారం భువనగిరి రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారస్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయన్నారు. కేసిఆర్ పక్కకు జరగంగానే.. కటక వేసినట్టే కరెంటు పోతుందని విమర్శించారు.
కేసీఆర్ పాయింట్స్
- రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగినాయి..రైతు భీమా అపహాస్యం అయ్యింది.
- యాదాద్రి నరసన్న మీద ఒట్టు పెట్టి పోయిండ్రు .. రుణమాఫీపై కాంగ్రెసోళ్ళు మాట మర్చిండ్రు
- నాలుగు వందల ఇరవై అబద్దపు హామీలు చెప్పిండ్రు
- తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు పంచాయితీ పడింది.
- భూమి, ఆకాశం ఒక్కటి చేసి పోరాటం చేస్తా..
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేరాలంటే బీఆరెస్ ఎంపీలు గెలవాలి.
- రైతు బంధు, ధాన్యం బోనస్ బోగస్ అయ్యింది.
- బీజేపీ పది సంవత్సరాలు పరిపాలన చేసినా ఎవరికి న్యాయం జరగలేదు.
- 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మోదీ ప్రభుత్వం నింపడం లేదు.
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి.
- రూపాయి విలువ దేశ చరిత్రలో 83 రూపాయల హీన స్థితికి దిగజారింది.
- ఒక పార్టీ దేవుని పేరు, ఇంకో పార్టీ ఒట్టు పెట్టుకుని ఓట్లు ఆడుకుంటున్నారు.
- భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ కలిసి మున్సిపల్ లో పీఠం ఎక్కిండ్రు.
- బీజేపీతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది.
- పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆరెస్ గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
- క్యామా మల్లేష్ పట్టుదల అనుభవం ఉన్న నాయకుడు.. ప్రజలకు తలలో నాలుకలో ఉంటాడు
- పదిహేనెళ్లు కొట్లాడి తెలంగాణ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన.
- స్వరాష్ట్రంలో తల్లి కోడి లాగా మిమ్ములను కాపాడుకున్నా.