దళితుడిని సీఎం చేయకపోవడానికి కారణాలున్నయ్

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో బండి సంజయ్ చెప్పాలన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. రాష్ట్రంలో 60–70 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.  ఏడాదికి రెండు కోట్ల ఉద్యగాలిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలన్నారు. బీజేపీ నేతలు మసిపూసి మారేడు కాయ చేస్తారన్నారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారనేది మిలియన్ ఆఫ్ ది జోక్ అని అన్నారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఏకానమీ గ్రోత్ లో, కానీ. ఉద్యోగ కల్పనలో గానీ, అభివృద్ధిలో కానీ తెలంగాణ ముందుందన్నారు. పదవులను చిత్తు కాగితాల్లా విసిరేసిన చరిత్ర తమదన్నారు. ప్రపంచ ఉద్యమాలకు పాఠం నేర్పిందే తెలంగాణ ఉద్యమం అని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వస్తే సిబ్బందిని ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గొర్ల  పైసలు కేంద్రానివే అయితే రాజీనామా చేస్తానన్నారు కేసీఆర్. దళితుడిని సీఎం చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. కరోనా సమయంలో రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉంటే కేంద్రం సాయం చేయలేదన్నారు. కేవలం రాజకీయాల కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు. నవోదయ పాఠశాలలు కావాలని 50 దరఖాస్తులిచ్చినా పట్టించుకోలేదన్నారు. పెట్రోల్,డీజిల్ మీద సెస్ తగ్గిస్తారా? లేదా  కేంద్రం చెప్పాలన్నారు. సెస్ తగ్గిస్తే 77 రూపాయలకే పెట్రోల్ వస్తుందన్నారు. దేశంలో ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు పెట్టే పార్టీ బీజేపీ అని అన్నారు.