రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే ప్రత్యేకమైన ఘట్టం అని అన్నారు సీఎం కేసీఆర్ . అసెంబ్లీలో మాట్లాడుతూ.. 1969 ఉద్యమంలో తాను కూడా లాఠీ దెబ్బలు తిన్నానన్నారు. ఉమ్మడి ఏపీలో అంతులేని వివక్ష జరిగిందన్నారు. కొంత మంది కేవలం కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. తమకు రాజకీయాలంటే పెద్ద టాస్క్ అన్నారు. పదవుల కోసం ఆనాడు మన నాయకులు మౌనంగా ఉన్నారన్నారు. చిల్లరగాళ్లను వదిలిపెట్టానన్నారు.తమకు నీళ్లు నిధులు నియామకాలు ముఖ్యమన్నారు. ఇవాళ నీళ్లు, నిధులు మనకే దక్కుతున్నాయన్నారు. నీళ్ల కోసం ఇంకా కొట్లాడుతున్నామన్నారు. తెలంగాణ సంస్కృతిపై ఆనాడు దాడి జరిగిందన్నారు. ఇవాళ రాష్ట్రంలో పంట పండితే కేంద్రం అడ్డుపడుతుందన్నారు. ధాన్యం అమ్మడానికి మూడు నెలల సమయం పడుతుందా? అని ప్రశ్నించారు. కరెంట్ ఉద్యోగస్తుల పంచాయతీ సుప్రీం కోర్టు వరకు వెళ్లిందన్నారు.