తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో  మాట్లాడిన కేసీఆర్. బీజేపీ గోవిందా .. 200 సీట్లు కూడా రావని  సర్వేలు చెబుతున్నాయన్నారు. బీజేపీకి ఓటేస్తే గోదారిలో వేసినట్టేనన్నారు. మోదీ గోదారి నీళ్లు తీసుకెళ్తా అంటుంటే తెలంగాణ బీజేపీ నోరు మెదపడం లేదని విమర్శించారు. వరిలో పంజాబ్ ను తలదన్నే స్థాయిలో తీసుకెళ్లానని చెప్పారు. దళారి వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గోదారి, కృష్ణ జలాలతో పాటు అనేక హక్కులు సాధించాలంటే బీఆర్ఎస్ అవసరమన్నారు.   

 
రేవంత్ రెడ్డి అడ్డగోలు హామిలిస్తున్నారని అన్నారు కేసీఆర్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాదు..వట్టి విక్రమార్క అని అన్నారు. ఉస్మానియాలో కనీస సదుపాయాలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు.  దళితబంధు,రైతుబంధు అడిగితే కాంగ్రెస్ నేతలు చెప్పుతో కొడతామంటున్నారు. జైళ్లకు,తోట మట్టలకు కేసీఆర్ భయపడబోరన్నారు.  ఖమ్మం పట్టణంలో మూడు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని.. ఇక్కడి నుంచే పోరాటం మొదలవ్వాలని అన్నారు.