నీటి వాటాలను తేల్చాల్సిన బాద్యత కేంద్రానిదే

రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదన్నారు. తెలంగాణ నీటి వాటా ఎంతో చెప్పాలన్నారు.విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. పార్లమెంట్ లో  విద్యుత్ చట్టం బిల్లు పాస్ కాకుండా పార్లమెంట్ లో  పోరాడతామన్నారు. వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధంగా మార్చాలన్నారు. అదే విధంగా నీటివాటాలపై కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామన్నారు. కృష్ణా,గోదావరి నీటి వాటాలను తేల్చేందుకు  వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. నీటి వాటాలు తేల్చకుంటే ఇతర రాష్ట్రాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. నీటి వాటాలను తేల్చాల్సిన బాద్యత కేంద్రానిదేనన్నారు.దయచేసి వెంటనే నీటి సమస్యలు పరిష్కరించాలన్నారు.