అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ్టి నుంచి 91,142 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తుందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామన్నారు. 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇక నుంచి 95 శాతం స్థానికులకే ఉద్యోగాలన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై మాట్లాడిన కేసీఆర్.. 9,10 షెడ్యూల్ పంచాయితీ ఇంకాతెగలేదన్నారు. ముల్కీ రూల్స్ కు మించి స్పిరిట్ ఇంప్లిమెంట్ రావాలన్నారు రు. ఆలస్యమయినా.. న్యాయం చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు.లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 22 వేల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. లక్షా 56 వేల ఉద్యోగాలను నోటిఫై చేశామన్నారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే అవకాశమన్నారు. శాశ్వత ప్రతిపాదికన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. దేశంలోనే ఉద్యోగులు అత్యధికంగా వేతనాలు తీసుకుంటున్నరాష్ట్రం తెలంగాణనే అన్నారు. అసలు ఉద్యోగి కంటే కాంట్రాక్ట్ ఉద్యోగి ఎక్కువ పనిచేస్తారన్నారు.