‘‘ఈ ఎన్నికలు తెలంగాణలో అవినీతి, నియంతృత్వ పాలనకు... ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం.. ఈ యుద్ధంలో ప్రజల ఆత్మగౌరవం గెలవాలంటే కేసీఆర్‌ను ఓడగొట్టాలి.. కేసీఆర్ మళ్లా గెలిస్తే తాను చేసిన తప్పుడు పనులన్నీ కరెక్ట్ అంటడు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కూడా అబద్ధం అంటడు. ధరణితో తప్పులు జరిగితే దానిని సవరించాలి. ఆ మాట అడిగినందుకు ధరణిని తీసేస్తే రైతుబంధు రాదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నడు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. పరీక్షల నిర్వహణలోనూ విఫలమైండు. పేపర్లు లీక్ చేసిండు. రూల్స్ ప్రకారం పరీక్షలు జరగడం లేదని నిరుద్యోగులు కోర్టుకు పోతే నిందిస్తున్నడు. కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. ఈ దుర్మార్గాలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. కేసీఆర్ మళ్లా గెలిస్తే ప్రజలు ఓడిపోతరు. ప్రజాస్వామ్యం ఓడిపోతది. చెన్నూర్‌లో బాల్క సుమన్ అరాచకాలు పెరిగిపోయాయి. ఈసారి కాంగ్రెస్అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి ఓటు వేసి గెలిపించాలి.’’
ALSO READ :- నేను అధికారంలోనే లేను.. నిరంతరం పోరాటాలే చేసిన : బండి సంజయ్