
- మిగతా సమయమంతా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు
- తెలంగాణకు ఎలా గుర్తింపు తేవాలన్నదే కేసీఆర్ తపన
- మంత్రి శ్రీనివాస్ గౌడ్
హనుమకొండ జిల్లా: ‘సీఎం కేసీఆర్ కేవలం మూడు గంటలే పడుకుంటాడు.. మిగతా సమయమంతా రాష్ట్రాన్ని ఎలా డెవెలప్ చేయాలో ఆలోచిస్తారు..ప్రపంచంలో తెలంగాణకు ఎలా గుర్తింపు తేవాలని తపన పడుతుంటారు..’అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో 8వ రాష్ట్ర వెటర్నన్ అథ్లెటిక్స్ మీట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్, 25 జిల్లాల నుంచి 800 మంది అథ్లెటిక్స్, స్పాట్స్ లో 101 సంవత్సరాల అథ్లెటిక్స్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు క్రీడలను పెద్దగా పట్టించుకోలేదన్నారు. అందుకే ప్రస్తుతం తెలంగాణలో క్రీడలకు పెద్ద పీట వేస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి స్టేడియం మంజూరు చేశామన్నారు. ఇప్పటికే 40 స్టేడియాలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. నిపుణులైన క్రీడాకారుల సలహాలు తీసుకొని తొందర్లోనే క్రీడా పాలసీ తీసుకొస్తామని చెప్పారు.
140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో తక్కువ పతకాలు, చిన్న మెడల్స్ తో సరిపెట్టుకునే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో మాదిరిగానే దేశంలో కూడా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు రోజుల్లో గ్రామీణ, మండల, జిల్లా, రాష్ర్టంలో సీఎం కప్ పేరునా పోటీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. గచ్చి బౌలీతోపాటు వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లో మెగా ఈవెంట్స్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రతి స్కూల్ లో గ్రౌండ్ ఉండాలని పాలసీలో మెన్షన్ చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి
నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు