మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, అక్టోబర్ 30వ తేదీ సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటన విచారకరమని... బాగా పనిచేసే నాయకులపై దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేని వారే కత్తులతో దాడులకు దిగారని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి తన మీద జరిగినట్లుగానే భావిస్తానన్నారు. హింసా రాజకీయాలను ప్రజలంతా ఖండించాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని... మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్ము రేగుతుందని కేసీఆర్ హెచ్చరించారు.
- ALSO READ | హైదరాబాద్కు ఎంపీ కొత్త ప్రభాకర్ తరలింపు
దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం సిద్ధిపేట జిల్ల దౌల్తాబాద్ మండలం పూరంపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని అనుచరులు చికిత్స నిమిత్తం సికింద్రబాద్ యశోద దవాఖానాకు తరలించారు.