కేసీఆర్  ఫార్మ్ హౌస్లోనే శేషజీవితం గడపాలి

కొత్తకొండ వీరభద్రస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో రేవంత్  ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో  మాట్లాడారు రేవంత్.  కేసీఆర్ స్వతహాగా ముసలోడిని అయ్యానని చెబుతున్నారు కాబట్టి తమ నినాదం బై బై కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్  ఫార్మ్ హౌస్ లోనే శేషజీవితం గడపాలని   సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారని విమర్శించారు.  అందుకే పబ్లిక్ మీటింగ్ లలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కామెంట్ చేస్తున్నారని అన్నారు.  భూపాలపల్లి లో 144 సెక్షన్ పెట్టడం స్థానిక ఎమ్మెల్యే కుట్రలు,అక్రమాలు,భూకబ్జా, సాయిల్డ్ తవ్వకాలు లాంటివి ఎక్కడ బయట పడతాయో అని కుట్రపూరిత చర్యలని ఆరోపించారు.  రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు,2 లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు